టెక్కలి: ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్టీఈ) 2026 సంవత్సరానికి ప్రకటించిన ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాల విభాగంలో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు అవార్డు లభించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెస్ట్ ఇంజినీరింగ్ కళాశాల విభాగంలో ఆదిత్య కళాశాలకు ఈ అవార్డు దక్కింది. విద్యా ప్రమాణాలు, నాణ్యమైన బోధన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ కళాశాలగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అనంతపురం శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ వి.వి.సుబ్బారావు, ఐఎస్టీఈ ఏపీ చైర్మన్ ప్రొఫెసర్ జి.రంగ జనార్దన, కార్యవర్గ సభ్యుడు శంభుప్రసాద్ చేతుల మీదుగా కళాశాల డైరెక్టర్లు వి.వి.నాగేశ్వరరావు, కె.మధుకుమార్ తదితరులు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావుతో పాటు అన్ని విభాగాల అధ్యాపక, అధ్యాపకేత సిబ్బంది అభినందనలు తెలిపారు.


