స్కూల్‌గేమ్స్‌ రాష్ట్రపోటీల్లో సత్తాచాటండి | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌గేమ్స్‌ రాష్ట్రపోటీల్లో సత్తాచాటండి

Nov 11 2026 3:57 AM | Updated on Nov 11 2026 3:57 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ పోటీల్లో తుది వరకూ పోరాడి విజయాలతో జిల్లాకు తిరిగిరావాలని జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి చల్లా జగదీష్‌ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వేదికగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న 70వ ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–14 బాలబాలికల వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల బృందం ఇక్కడి నుంచి పయనమై వెళ్లింది. వీరికి జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యాలయంలో వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో జీఎం జ్యోతిరాణి, వాలీబాల్‌ సంఘ జిల్లా సెక్రటరీ కె.రామచంద్రుడు, సతీష్‌, ఎన్‌.వి.రమణ, యశోద తదితరులు పాల్గొన్నారు. అలాగే, కాకినాడ జిల్లా పిఠాపురం వేదికగా ఈ నెల 11 నుంచి 13 వరకు జరగనున్న అండర్‌–19 బాలబాలికల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల బృందం కూడా శ్రీకాకుళం రోడ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పయనమై వెళ్లింది. వీరికి ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ జగదీష్‌, బాక్సింగ్‌ కోచ్‌లు ఉమామహేశ్వరరావు, అప్పలరాజు, రాజీవ్‌, జేఎల్‌ చంద్రశేఖర్‌ తదితరులు వీడ్కోలు పలికారు. క్రీడాదుస్తులు, రవాణా సదుపాయాలు, ట్రావెలింగ్‌ అలవెన్సులు సమకూర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement