మరణంలోనూ ఐదుగురికి ప్రాణదానం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ ఐదుగురికి ప్రాణదానం

Nov 11 2026 3:57 AM | Updated on Nov 11 2026 3:57 AM

శ్రీకాకుళం రూరల్‌ : కల్లేపల్లి పంచాయతీ మోపసుబందరుకు చెందిన యాళ్ల నీలవేణి మరణానంతరం ఐదుగురికి అవయవదానం చేశారు. ఈమె ఈ నెల 8న హెమరేజిక్‌ స్ట్రోక్‌తో రాగోలు జెమ్స్‌ ఆసుపత్రిలో చేరింది. చికిత్స అందించిన వైద్యులు నీలవేణిని బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. అవయవ దానంపై విజయవాడకు చెందిన జీవన్‌దాన్‌ ప్రతినిధులు అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఊపిరితిత్తులను హైదరాబాద్‌ కిమ్స్‌కు, కిడ్నీ, కాలేయాన్ని శ్రీకాకుళం జెమ్స్‌కు, మరో కిడ్నీని కాకినాడ అపోలో ఆస్పత్రికి, నేత్రాలను రెడ్‌క్రాస్‌కు తరలించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహానికి గౌరవ వందనం సమర్పించి, కుటుంబ సభ్యులకు ధ్రువపత్రాలను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement