శ్రీకాకుళం పాతబస్టాండ్ : రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఆర్‌ఓ, ఏఆర్‌ఓ నియామకాల్లో సీనియారిటీకి ప్రాధాన్యమివ్వాలని, స్టేజ్–1, స్టేజ్–2 ఆర్వోలలో ఏదో ఒక డ్యూటీ మాత్రమే వేయాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్కూరు వెంకటేశ్వర్లు, అదనపు కార్యదర్శి పి.బాలాజీ, ఉపాధ్యక్షులు బి.నవీన్ కోరారు. ఈ మేరకు మంగళవారం డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావును ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, గర్భిణులకు, బాలింతలకు మినహాయింపులు ఇవ్వాలని, ఎన్నికల మరుసటి రోజు జర్నీడేగా ఓడీని కేటాయించాలని, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటర్లలో గందరగోళం లేకుండా చూడాలని, ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన పారితోషికాన్ని చెల్లించాలని విన్నవించారు.
‘ప్రజల్లోకి బీజేపీ అక్రమాలు’
శ్రీకాకుళం అర్బన్: బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘ఓట్ బచావో..దేశ్ బచావో’ నిరసన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఏఐసీసీ అబ్జర్వర్, మాజీ ఎంపీ కె.జయకుమార్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గంట గోపి, డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జయకుమార్


