ఎల్.ఎన్.పేట: మండల పరిఽధిలో అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ధనకువాడ గ్రామానికి చెందిన తర్ర జగన్మోహనరావు(35) అనే యువకుడి నిండు ప్రాణా న్ని బలి తీసుకున్న ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల అందించిన సమాచారం మేరకు ధనుకువాడ గ్రామానికి చెందిన తర్ర జగన్మోనరావు ఆదివారం అర్ధరాత్రి ఎల్.ఎన్ పేట జంక్షన్ నుంచి ఇంటికి వెళ్తుండగా కోవిలాం సమీపంలోని ఒక ప్రైవేటు స్కూల్ వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో జగన్మోహనరావు తలకు బలమైన గాయమై మృతి చెందా డు. రోడ్డుపై గుంతల కారణంగానే బండి అదు పు తప్పి ఇంత ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. జగన్మోహనరావుకు వివాహమై విడాకులు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి తమ్ముడు మురళీమోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.


