● స్థానిక ఎన్నికల్లో విచ్చలవిడిగా మద్యం పంపిణీ
● రానున్న సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి
నుంచే ‘మందు’ జాగ్రత్త
శ్రీకాకుళం క్రైమ్ : సిక్కోలు వసారాలో సారా ఏరులై పారింది. స్థానిక ఎన్నికల సందర్భంగా నాయకులు తాగినోళ్లకు తాగినంత మద్యం పంపిణీ చేశారు. ఏకంగా దాదాపు రూ.106.92 కోట్ల మద్యం తాగినట్లు సమాచారం. కాశీబుగ్గ, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి ఆర్మీ క్యాంటీన్ల ద్వారా అధిక మొత్తంలో కార్లు, ద్విచక్ర వాహనాల్లో స్కూలు బ్యాగుల్లో తరలించారు. ఇంతలా అక్రమ మద్యం అనేక మా ర్గాల్లో వస్తున్నా పోలీసుల స్పెషల్, రూట్ మొబైల్ పార్టీల నిఘా మసకబారిందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
మందుబాబులకు పండగ
జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకు మందుబాబులు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం అమ్మకూడదని నిబంధనలున్నా.. ఎమ్మార్పీకి మించి రూ. 20 నుంచి రూ.40 వరకు బాటిల్‌పై వసూలు చేసి లెక్కలేనన్ని లిక్కర్ కేసుల బాక్సులు సరఫరా చేయడం విశేషం. వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి, సోంపేట, ఆమదాలవలస, జేఆర్ పురం ఏరియాల్లో విచ్చలవిడిగా ఇలా సరఫరా చేశారు.
‘మందు’చూపు
ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీ ఎన్నికల్లోనే కాక జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లయితే పార్టీతో సంబంధం లేకుండా మ ద్యం తెగ తాగేశారు. అధికార కూటమైతే మరింత మద్యాన్ని పారించింది. ఈ నెల 26, 29, వచ్చే నెల


