● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం రూరల్: స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. నామినేషన్లను అడ్డుకోవడం, తిరస్కరించడం, పోటీ చేయాలనుకున్న వారిని బెదిరించడం వంటి జుగుప్సాకరమైన సంఘటనలు జరిగాయన్నారు. పెదపాడులో ని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం 300 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే నియోజకవర్గంలో 120 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేసే అవకాశం లేకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. జిల్లాలో చాలామంది ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభిమానం చాటుకున్నారని, ఆ ఫలితాలను తారుమారు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కిష్టప్పపేట సానివాడ ఎంపీటీసీ ఎన్నికల ఫ లితాల్లో తొలుత వైఎస్సార్ సీపీ అభ్యర్థి 300 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆ ఫలితాలను సైతం తారుమారు చేసి ప్రత్యర్థి అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని వివరించారు. ఇలాంటి అన్యాయమైన విధానాలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.


