● అన్యాయానికి గురైన ఎచ్చెర్ల దివ్య
● ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సానివాడ పరిషత్ ప్రాదేశిక స్థానం పరిధిలో ఓటర్లు తనకు ఓటేసి గెలిపించినా.. టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఆ ఓట్లను టీడీపీ ఖాతాలో వేసి, ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించారని సానివాడ ఎంపీటీసీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎచ్చెర్ల దివ్య అన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ తాను గెలిచిన స్థానాన్ని టీడీపీ ఖాతాలో వేసేంతవరకు నిద్ర పోలేదని, సొంత ఎంపీటీసీ కూడా గెలినిపించుకోలేని ఎమ్మెల్యేగా మిగిలిపోతాననే భయంతో అధికారులతో అక్రమాలు చేయించారని ఆరోపించారు. తాను గెలిచిన ఎంపీటీసీ స్థానం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ పరం కా వాలని ఎమ్మెల్యే, మంత్రులు కుట్రలు పన్నారన్నారు. అధికారుల పీకపై కత్తి పెట్టి, తన విజయా న్ని హైజాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో తనకు ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులు ఎదుర్కొని నిలబడిన తోటి ఎంపీటీసీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.


