ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

మందస: మండలంలో అక్రమ ఇసుక రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదివాపీ గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు సవర గురునాథ్‌, సవర భావన్న డిమాండ్‌ చేశారు. మందస మండలం సాబకోట పంచాయతీ బిత్తరబంధ గ్రామం నక్కసాయి గెడ్డ ప్రాంతంలో జేసీబీలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి ఒడిశా రాష్ట్రానికి తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడం సరికాదన్నారు. వంతెన దెబ్బతినడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న పొలాలకు సరిగ్గా నీరు అందని పరిస్థితి నెలకొంటుందన్నారు. గనులు, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు తక్షణమే స్పందించి నక్కా సాయి గెడ్డ ప్రాంతంలో ఇసుక తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామానికి చెందిన సవర ప్రకాష్‌ సవర కృష్ణ, సవర ప్రతిమ తదిరులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement