వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు హత్యాయత్నం కేసు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు హత్యాయత్నం కేసు

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు హత్యాయత్నం కేసు

ఎస్పీ గారూ..

కలెక్టర్‌ సారూ..

●శాలిహుండం ఎంపీటీసీ పరిధి కొత్తపేట పోలింగ్‌ స్టేషన్‌ వద్ద ఏకంగా కొట్లాట జరిగింది.

●టెక్కలి మండలం తొలుసూరుపల్లి ఎంపీటీసీ పరిధి భగవాన్‌పురం పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ పొన్నాడ శ్యామలరావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కనీసం ఆస్పత్రిలో చికిత్స అందజేయకుండా పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ రోజున శ్రీకాకుళం రూరల్‌ మండలం కిష్టప్పపేటలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వైఎస్సార్‌ సీపీ నాయకులైన ఎచ్చెర్ల శ్రీధర్‌, బాణ్ణ నర్సింగరావులపై నమోదైన హత్యాయత్నం కేసు తప్పుడు కేసుగా జిల్లా న్యాయస్థానం నిర్ధారించింది. దీనికి సంబంధించి శుక్రవారం న్యాయస్థానం రిమాండ్‌ను తిరస్కరించి పూచీకత్తుతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పోలింగ్‌ సమయంలో ఎంపీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త ఎచ్చెర్ల శ్రీధర్‌, బాణ్ణ నర్సింగరావు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎమ్మె ల్యే తండ్రి గొండు జగన్నాథరావు పోలీసుల కు అదే రోజు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కోసం శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచా రు. న్యాయవాదుల వాదనలపై కోర్టు ఇలా స్పందించింది. అక్రమంగా అరైస్టెన వైఎస్సార్‌సీపీ నేతలకు శుక్రవారం బెయిల్‌ మంజూరు కావడంతో వారంతా మాజీమంత్రి సీనియర్‌ నాయకులు ధర్మాన ప్ర సాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ లను మర్యాదపూర్వకంగా కలిశారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లాలో పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించడంపై రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలు కూడా విస్తుపోతున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికల విధులకు నిర్వహించిన సిబ్బందిని కీలుబొమ్మలు చేసి మరీ రిగ్గింగ్‌ చేశారు. శ్రీకాకుళం పరిధిలో అధికార పక్ష నాయకులు యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డారు. వీటికి పోలీసులే సాక్షి. ప్రతిపక్ష ఏజెంట్లను లేకుండా చేసి, పోలింగ్‌ కేంద్రాలను అధికార పార్టీ నాయకుల గుప్పెట్లోకి తీసుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇవన్నీ అధికారుల కళ్ల ముందే జరిగినా.. పాలకుల సూచనల మేరకు ‘ప్రశాంత పోలింగ్‌’ అంటూ ప్రకటన చేయడం హాస్యాస్పదమని జిల్లా వాసులంటున్నారు.

ఘర్షణలు కనిపించాయా..?

జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దాడులకు దిగారు. ఘర్షణ పడ్డారు. పలుచోట్ల నాయకులను కొట్టి గాయపరిచారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపిస్తుంటే ఎన్నికల యంత్రాంగం ఏం చేసిందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తిరిగి బాధితులను నిర్బంధించిన వైనాలను కూడా జిల్లా అంతా చూసింది. జిల్లాలో ఉదయం నుంచే కొన్ని చోట్ల రిగ్గింగ్‌ జరుగుతున్నా సాయంత్రం 5గంటల వరకు జిల్లా పోలింగ్‌ శాతం ఆశాజనకంగా లేదు. ఎప్పుడైతే సాయంత్రం ఆరు దాటిందో ఒక్కసారిగా పోలింగ్‌ శాతం పెరిగిపోయింది. ఆ మతలబు ఏమిటో జిల్లా వాసులందరికీ ఎరుకే.

ఈ సంఘటనలు కనిపించలేదా..?

●టెక్కలిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లో రాత్రి వరకు నిర్భందించారు. చివరకు ఓటు హక్కు సైతం వినియోగించుకోకుండా చేశారు.

●టెక్కలిలో రాహుల్‌, మండలంలో తొలుసూరుపల్లిలో గూన గోపాలరావు, బెండి రామకృష్ణ, హనుమంతు శ్రీనివాసరావు, అయోధ్యపురం పోలింగ్‌ కేంద్రంలో ఏజంట్లు దుంపల ఈశ్వర్రావు, బాలగోపాల్‌, గొల్లపల్లి తేజేశ్వర్రావు, కుందు రామకృష్ణ, ముడిదాన కరుణల తదితర వైఎస్సార్‌సీపీ ఏజంట్లను బయటకు గెంటేశారు.

●నందిగాం మండలంలో దాదాపు 20 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది కళ్ల ఎదురుగానే రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

●మందస మండలంలో నారాయణపురం గ్రామంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ బూత్‌ ఏజెంట్‌తో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దాడికి యత్నించారు.

●కొత్తూరు పోలింగ్‌ స్టేషన్‌ వద్ద టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది.

●సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో పోలింగ్‌ ప్రారంభమైన అరగంటలోపే ఉద్రికత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement