శ్రీ శివానీ, ఐతమ్, పలాస జీజేసీ కాంపౌండ్‌లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లెక్కింపునకు 696 టేబుళ్లు, విధుల్లో 4114 మంది సిబ్బంది
నేడే పరిషత్ కౌంటింగ్..
టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు భద్రత
అరసవల్లి: స్థానిక సంస్థల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలకు పోలింగ్ ముగియడంతో శనివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రి య మొదలుకానుంది. మొత్తం 30 జెడ్పీటీసీల స్థానాలకు 95 మంది అభ్యర్థులు, 523 ఎంపీటీసీల స్థానాలకు 1222 మంది అభ్యర్థులు బరి లో ఉండగా.. నేటి ఉదయం నుంచి మొదలుకానున్న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు జిల్లా వాసులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో శ్రీశివాని ఇంజినీరింగ్ కళాశాల (చిలకపాలెం), ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల (కె.కొత్తూరు–టెక్కలి), ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పలాస)లలో కౌంటింగ్ కేంద్రాలుగా సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను శనివారం ఉదయం కట్టుదిట్టమైన భద్రతల నడుమ తెరవనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి బందోబస్తు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దీంతో ప్రత్యేక పాసులున్న వారికి మాత్రమే ఈ కేంద్రాల్లోకి అనుమతించేలా జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 30 మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఓట్లను లెక్కించేందుకు చిలకపాలెంలో శ్రీశివాని ఇంజినీరింగ్ కళాశాల, కె.కొత్తూరు (టెక్కలి)లో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, పలాసలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లలో వివిధ పార్టీల ఓట్లను వేరు చేయడంతో పాటు లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఇందుకోసం మొత్తం 696 టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం 4114 మంది సిబ్బంది ఈ కౌంటింగ్‌లో విధులు నిర్వర్తించనున్నారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక్కో సహాయక సూపర్‌వైజర్, ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లతో కలిపి మొత్తం ఐదుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరితో పా టు అత్యవసర విధులకు 126 మంది సూపర్‌వైజర్లు, 138 మంది సహాయకులు, 370 మంది అసిస్టెంట్లతో కలిపి 634 మందిని రిజర్వ్‌లో ఉంచారు. ఇందులో అత్యధికంగా రణస్థలంకు 38 టేబుళ్లు, గారకు 34 టేబుళ్లను ఏర్పాటు చేయగా, అత్యల్పంగా ఎల్‌ఎన్ పేటకు 12 టేబుళ్లను మాత్రమే ఏర్పాటు చేశారు.
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 30 మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు.
శ్రీకాకుళం డివిజన్ (14)
శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాల (చిలకపాలెం)
శ్రీకాకుళం, గార, నరసన్నపేట, పోలాకి, జలుమూరు,ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి.సిగడాం,ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి, పొందూరులతో పాటు సారవకోట మండలాలు.
టెక్కలి డివిజన్ (09)
ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల (టెక్కలి)
టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం, మెళియాపుట్టి, పాతపట్నం, ఎల్‌ఎన్.పేట, కొత్తూరు, హిరమండలం మండలాలు.
పలాస డివిజన్ (02)
ప్రభుత్వ జూనియర్ కళాశాల (పలాస)
సోంపేట, కవిటి మండలాలు
పలాస డివిజన్ (05)
ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పలాస)
పలాస, మందస, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం, కంచిలి మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఓట్ల కౌంటింగ్‌ను నిర్వహించనున్నా రు. తదుపరి ఎన్నికల ఫలితాలను కూడా శనివారం సాయంత్రమే ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్దనే వెల్లడించేలా అధికారులు చర్యలు చేపట్టారు.


