న్యూస్‌రీల్
ప్రాణాలతో చెలగాటంజనావాసాల్లో మతాబుల వ్యాపారం చేస్తున్నారు. ఇది ప్రాణాలతో చెలగాటమే. –8లో
నవనంబాడు రీపోలింగ్ పూర్తి
అరసవల్లి/శ్రీకాకుళం రూరల్: పొన్నాం పంచాయతీ నవనంబాడులో శుక్రవారం రీపోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల కల్లా 70 శాతం ఓట్లు నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. రెండు బూత్‌లలో 932 ఓట్లకు గాను 655 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 316 మంది పురుషులు, 339 మంది సీ్త్రలు ఉన్నారు. జిల్లాలో పరిషత్ పోలింగ్ ప్రక్రియ శుక్రవా రం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 2004 పోలింగ్ కేంద్రాల్లో ‘పరిషత్’ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో జెడ్పీటిసీ స్థానాలకు మొత్తంగా 65.36 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా, ఎంపిటిసిల స్థానాలకు మొత్తంగా 65.51 శాతం నమోదైనట్లుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారిక ప్రకటన చేశారు.


