చీకటిలో.. ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

చీకటిలో.. ప్రజాస్వామ్యం ఖూనీ

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

చీకటిలో.. ప్రజాస్వామ్యం ఖూనీ విపక్షాల వాదన ఇలా...

పోలింగ్‌ రోజు లెక్కలకు, మరుసటి రోజు లెక్కలకు భారీ వ్యత్యాసం

రాత్రి వేళ ఏం జరిగింది?

వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు

పంపించి భారీగా రిగ్గింగ్‌

యంత్రాంగం సహకారంతో అక్రమాలు జరిగాయని ఆరోపణలు

ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు : 15,69,362

గురువారం సాయంత్రం 6 గంటలకు

ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం పోలైన ఓట్లు : 9,00,221

శుక్రవారం ఉదయం 6 గంటలకు

ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం పోలైన ఓట్లు : 10,28,016

జెడ్పీటీసీ ఎన్నికల మొత్తం ఓట్లు : 16,20,965

గురువారం సాయంత్రం 6 గంటల రిపోర్ట్‌

జెడ్పీటీసీలకు పోలైన ఓట్లు : 9,29,419

శుక్రవారం ఉదయం 6గంటలకు ఇచ్చిన

రిపోర్ట్‌ ప్రకారం పోలైన ఓట్లు : 10,59,426

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

జిల్లాలో గురువారం జరిగిన పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తీరుపై రాజకీయ దుమారం రేగుతోంది. పోలింగ్‌ ముగిసే సమయానికి ప్రకటించిన అధికారిక అంచనాలకు, మరుసటి రోజు ఉదయానికి వెల్లడైన తుది శాతానికి భారీ వ్యత్యాసం ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయంత్రం వేళల్లో క్యూలు పెద్దగా లేకపోయినా, ఓటు శాతం ఊహించని విధంగా పెరగడం వెనక రిగ్గింగ్‌ హస్తం ఉందనే ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.

పోలింగ్‌ ముగిసిన వెంటనే అధికారులు ఇచ్చే ప్రాథమిక శాతానికి, తుది నివేదికకు మధ్య స్వల్ప తేడాలు ఉండటం సహజమే. కానీ ఈసారి శాతాలు భారీగా పెరగడం గమనార్హం. వాస్తవంగా పోలింగ్‌ సాయంత్రం ఐదు గంటలకు ముగియాలి. ఈలోపు క్యూలో ఉంటే వారంతా ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తారు.

అయితే సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపీటీసీలకు 9,00,221ఓట్లు(57.36శాతం) పోలైనట్టు సాయంత్రం 6గంటలకు అధికారిక రిపోర్ట్‌ ఇవ్వగా, శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 10,28,016 ఓట్లు (65.51శాతం) పోలైనట్టు ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కసారిగా 1,27,795ఓట్లు (8.15ఓట్లు) పెరిగినట్టైంది.

అలాగే జెడ్పీటీసీలకు సాయంత్రం 5గంటల వరకు 9,29,419ఓట్లు (57.34శాతం) పోలైనట్టు సాయంత్రం 6గంటలకు విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొనగా, శుక్రవారం ఉదయం 6గంటలకు ఇచ్చిన రిపోర్ట్‌లో 10,59,426ఓట్లు (65.36) పోలైనట్టు వెల్లడించారు. ఈ లెక్కన 1,30,007ఓట్లు (8.02శాతం)పెరిగినట్టైంది.

● పోలింగ్‌ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రకటించిన శాతానికి, మరుసటి రోజు వెల్లడించిన తుది శాతానికి పొంతన లేదు.

● భారీ వ్యత్యాసం ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

● ఒక పక్క వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటికి పంపించడం, మరోవైపు అడ్డొచ్చిన వాళ్లపై దాడులు చేసి, తిరిగి బాధితులను అరెస్టులు చేసి పోలీసు స్టేషన్‌లకు పంపించడం వెరసీ పోలింగ్‌ బూత్‌ల్లో రిగ్గింగ్‌కు అడ్డు అదుపూ లేకుండా పోయింది.

● దాని ఫలితంగానే సాయంత్రం వేళ ఒక్కసారిగా ఓటింగ్‌ శాతం పెరిగిపోయింది.

● జిల్లాలో పలు మండలాల్లో ప్రతిపక్షాల పోలింగ్‌ ఏజెంట్లను భయబ్రాంతులకు గురి చేసి, బెదిరించి కేంద్రాల నుంచి బయటికి పంపించేశారు.

● ఒకరిద్దరు అడ్డు తగిలితే దాడులు చేసి, పోలీసుల చేత అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు పంపించారు.

● సాయంత్రం 5గంటల తర్వాత పోలింగ్‌ కేంద్రా ల్లో వెలుగులు తగ్గిన వేళ అధికార యంత్రాంగం, పోలీసుల సహకారంతో ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే మరుసటి రోజు ఉదయానికి ఓట్ల శాతం భారీగా పెరిగిందని విపక్షాలు వాదిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement