మల్లన్న సన్నిధిలో ఆర్టీఐ కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

మల్లన్న సన్నిధిలో ఆర్టీఐ కమిషనర్‌

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

మల్లన్న సన్నిధిలో ఆర్టీఐ కమిషనర్‌ అందరికీ కనిపించినా.. అధికారులకే కనిపించడం లేదు

టెక్కలి రూరల్‌: రావివలస గ్రామంలోని ఎండ ల మల్లికార్జున స్వామిని శుక్రవారం ఆర్టీఐ కమి షనర్‌ పి.సింహాద్రి నాయుడు వారి కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి.గురునాథరావు కమిషనర్‌కు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం ఆర్టీఐ కమిషనర్‌ పి.సింహాద్రి నాయుడు, ఆయన కుటుంబసభ్యులకు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసా దాలు అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, దేవదాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ శివార్లలో పార్వతీశం పేట జంక్షన్‌ వద్ద ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పర్వం పెచ్చుమీరుతోందని పట్టణానికి చెందిన పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో రహదారి పక్కన, ఆర్‌అండ్‌బీ స్థలంలోని, అలాగే వంశధార 23 ఆర్‌ పిల్లకాలువ గట్టు ఆక్రమణలు చేసి కొన్ని బడ్డీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏకంగా శాశ్వత నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఇదంతా ఆమదాలవలస మున్సిపల్‌, రెవెన్యూ, వంశధార, ఆర్‌ అండ్‌బీ అధికారులు నిత్యం చూస్తూ ఉన్నా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న స్థలాల్లో నిర్మాణాలు చేసుకుంటుంటే వారికి అడ్డకట్ట వేస్తూ ఇబ్బందులు పెడుతున్న మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఈ అక్రమ నిర్మాణాలు కానరాలేదా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement