● జిల్లాను నిలువునా మోసం చేసిన టీడీపీ
● ఎన్నికల సమయంలో లెక్కలేనన్ని హామీలు
● ఒక్కటీ అమలు చేయని దుస్థితి
● పబ్లిసిటీ తప్ప పనులు చేయని వైనం
ఇవి గుర్తున్నాయా..?
● అధికారంలోకి రాగానే పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అగ్నిమాపక కేంద్రం, 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నా రు. ఇంతవరకు వాటికి అతీగతి లేదు..
● ఆమదాలవలస నియోజకవర్గంలో పురుషోత్తపురం వద్ద వంశధార నదిపై, ముద్దాడపేట వద్ద నాగావళి నదిపై వంతెనల నిర్మాణాలు పూర్తి చేస్తామని, నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడం లేదు.
● ఆఫ్‌షోర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేస్తామని, ప్రభుత్వం ఏర్పాటు కాగానే వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తామని, పలాసలో డిఫెన్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. వాటిలో ఒక్కదానికి కూడా అతీగతి లేదు.
● నరసన్నపేట పరిధిలో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, వంశధార–బాహుదా నదుల అనుసంధానం చేస్తామని, కళింగ వైశ్యులను ఓబీసీలో చేర్చుతామని, టెక్కలిలో వైద్య కళాశాల ఏర్పా టు చేస్తామని, బుడగట్లపాలెంలో మత్స్యకార జెట్టీ నిర్మాణం చేస్తామని ప్రజల్ని ప్రలోభ పెట్టారు. వీటిలో ఒక్కటంటే ఒక్కటీ అమలు కాలేదు.
సూపర్‌సిక్స్..మోసం ఫిక్స్
● నిరుద్యోగ భృతికి దర్జాగా ఎసరు పెట్టారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాల హామీనే మర్చిపోయారు.
● మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు 19 నుంచి 60ఏళ్ల లోపు మహిళలకు నెలకి రూ. 1500 ఇస్తామని చెప్పారు. ఈ మాట పాలకులకు అసలు గుర్తు లేదు.
● 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని గత ఎన్నికల ముందు చెప్పారు. కానీ సాధారణ పింఛన్లు సైతం ఒక్కటైనా ఇవ్వలేదు.
సీఎం హోదాలో చెప్పినా..
గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎలాగూ గుర్తు లేదు. ఎన్నికల్లో గెలిచాక మూడు సార్లు జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. కానీ వాటి ని సైతం మర్చిపోయారు. ఇచ్ఛాపురం, బుడగట్లపాలెం గ్రామాలకు వచ్చినప్పుడు పలు హామీలు ఇచ్చారు.
● బాహుదాలో గ్రోయిన్స్ తదితర మరమ్మతు పనులు కోసం, అరకబద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం రూ. 30 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇంతవరకు మంజూరు చేయలేదు.
● బెంతొరియాల పేరుతో స్థానికత ఽధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామన్నా రు. ఇప్పటికీ ఇవ్వడం లేదు. కానీ ఈ హామీ పేరుతో ఎమ్మెల్యే రెండు సార్లు స న్మానాలు మాత్రం చేయించుకున్నారు.
● ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.
● అరసవల్లి సూర్య దేవాలయం అభివృద్ధికి రూ.100కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తానన్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.
● పలాస కిడ్నీ ఆస్పత్రికి రూ. 60కోట్లు ఇస్తున్నానని ప్రకటించారు. చేసిందేమీ లేదు.
● బుడగట్లపాలెం గ్రామంలో 18మందికి ఇళ్లు ఇస్తామన్నారు. ఇంతవరకు అతీగతి లేదు.
● బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఏమీ చేయలేదు సరికదా ఉన్న నిర్మాణ ఎక్విప్‌మెంట్‌ను తరలించేశారు.
● మూలపేట పోర్టు పనులను కావాలనే జాప్యం చేస్తున్నారు.
పేటలో ఇచ్చిన మాటలు..
● స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కో సం ఈ ఏడాది మే నెలలో నరసన్నపేటకు వచ్చారు. అక్కడ కూడా నోటికొచ్చిన హామీలిచ్చారు. చేసిందేమీ లేదు గాని ప్రారంభించిన చెత్త సంపద కేంద్రాన్ని గాలికొదిలేశారు.
● నరసన్నపేటలోని రాజుల చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. విజయవాడ వెళ్లిపోగానే మరిచిపోయారు.
● ఎర్రన్నాయుడు పార్క్ విషయంలో కోర్టు క్లియరెన్స్ తీసుకొస్తామన్నారు. ఆ బాధ్యతలు ఎంపీకి అప్పగించామన్నారు. అలాగే వదిలేశారు. ఎంతవరకు వచ్చిందో ఎవరికీ తెలియదు.
● శ్రీముఖలింగంలో వేడుకలు రాష్ట్ర పండగగా చేస్తామన్నారు. ఇప్పటివరకు దాని ఊసే లేదు.
● బొంతు ఎత్తిపోతల పథకం, మడపాం, కామేశ్వరిపేటలో ఎత్తిపోతల పథకాలు ప్రకటనకే పరిమితమయ్యాయి.


