నందిగాం: పెద్దలవునిపల్లి పంచాయతీ చిన్నలవునిపల్లి నుంచి 14 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో శనివారం చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వారందరికీ తిలక్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బసవల తరుణ్, పాలవలస వైకుంఠరావు, పాలవలస అప్పారావు, కాసి పురుషోత్తం, రోకల హేమసుందరరావు, పాలవలస చక్రధర్, సిర్ల ప్రసాద్, పాలవలస గిరి, బసవల కృష్ణారావు, బసవల సాంబమూర్తి, అంబోడి జోగారావు, అంబోడి నర్సింహమూర్తి, బసవల బాబూరావు, తెంబూరు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


