ఆదివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2026
ఉద్దానం పల్లెల్లో పగిలిన గాజులు.. ఆ పొలిమేరల్లో తెగిన తాళిబొట్లు.. ఆ దారుల్లో కలిసిపోయిన కన్నీటి బొట్లు..
అక్కడ అలవాటైపోయిన చావు డప్పులు.. వీటిని గుర్తించిన నాయకులెవరు..? కిడ్నీ వ్యాధి కంటే ముందు చికిత్స కోసం చేసిన ఖర్చు చంపేస్తుంటే.. అందుబాటులో ఆస్పత్రి కట్టిందెవరు? సంపాదన అంతా మందులకే అయిపోతుంటే.. రూ.10వేలు పింఛన్ ఇచ్చిందెవరు.? వ్యాధికి తాగునీరే కారణమన్న అనుమానం ఉంటే.. హిరమండలం నుంచి నీరు తెచ్చిందెవరు..? అన్నింటికీ ఒకటే సమాధానం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. దశాబ్దాలుగా కుర్చీ వదలని నాయకులు చేయలేనిది, విజనరీల ఆలోచనకు కూడా అందనిది ఐదేళ్ల పాలనా కాలంలోనే వైఎస్ జగన్ చేసి చూపించారు. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం


