శ్రీముఖలింగం ఆలయంపై ఆకాశ దీపం | - | Sakshi
Sakshi News home page

శ్రీముఖలింగం ఆలయంపై ఆకాశ దీపం

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ఆలయంపై బుధవారం ఆకాశ దీపం వెలిగించారు. ఈ ఆలయం పూర్వీకుల నుంచి ఒడిశా సంప్రదాయం ప్రకారం ఆశ్వీయుజ మాసం గౌరీ పౌర్ణమి అనంతరం బహుళ పాఢ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ ఇలా ప్రతిరోజూ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాన్ని వెలిగిస్తారు. పాఢ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ ఒడిశా నుంచి భక్తుల తాకిడి ఉంటుందని అర్చకులు తెలిపారు. అలాగే ఒడిశా ప్రజలు గౌరీ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు కార్తీక మాసం పాటించి ఎక్కువగా దైవారాధనలో గడుపుతారు.

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

కంచిలి: సోంపేట నుంచి బారువ రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం గుర్తించారు. మరణించిన వ్యక్తికి సుమారు 50 ఏళ్లు ఉంటాయి. మృతదేహం వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లభించలేదు. మృతుడు నీలం, నలుపు, తెలుపు రంగులు కలిగిన చెక్‌ షర్ట్‌, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసినవారు 92475 85743 నంబర్‌ను సంప్రదించాలని రైల్వే పోలీసులు సూచించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

లావేరు: మండలంలోని బొడ్డపాడు వైఎస్సార్‌ కాలనీ వద్ద లావేరు రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీపురుపల్లి గ్రామానికి చెందిన మల్లు రవికుమార్‌ అనే వ్యక్తి సుభద్రాపురం వైపు ద్విచక్ర వాహనంతో వస్తుండగా.. బొడ్డపాడు వైఎస్సార్‌ కాలనీ వద్దకు చేరేసరికి బైక్‌కు కుక్క అడ్డంగా వచ్చింది. దీంతో పడిపోవడంతో బైక్‌పై ప్రయణిస్తున్న రవికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఈయనను 108 వాహనంలో చికిత్స నిమిత్తంగా రణస్థలం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

అది.. కార్గో షిప్‌

వజ్రపుకొత్తూరు: మండలంలోని మంచినీళ్లపేట సముద్ర తీరానికి చేరుకున్న భారీ ఓడను బుధవారం తాము గుర్తించామని బావనపాడు మైరెన్‌ సీఐ డి.రాము తెలిపారు. విశాఖ నుంచి పారాదీప్‌ వెళ్లే సరుకు రవాణా(కార్గో)షిప్‌ అని ఆయన తెలిపారు. మత్స్యకారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెను తుపాను, ఈదురుగాలులు, వాయుగుండం కారణంగా ఓడను తీరానికి సమీపంలో లంగరు వేశారని వెల్లడించారు. రాత్రివేళ సైరన్‌ మోగిస్తూ.. రెడ్‌లైట్‌ వెలిగిస్తారని, ప్రమాదంలో ఉంటే సమీపంలోని తీర ప్రాంత మత్స్యకారులు, భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చేందుక వీలుగా అలా చేస్తారన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

దూసి రైల్వేస్టేషన్‌కు మహర్దశ

ఆమదాలవలస: దూసి రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్టేషన్‌ డవలప్‌మెంట్‌ కమిటీ సభ్యుడు పొన్నాడ రవికుమార్‌ తెలిపారు. దూసి రైల్వేస్టేషన్‌లో గాంధీ స్మృతి వృక్షం పరిసరాలను అభివృద్ధి చేసేందుకు బుధవారం స్థల పరిశీలన చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర నివేదికను రైల్వే అధికారులకు అందించి, పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ జీవీరాజు తదితరులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement