● వణికిన ఉద్దానం | - | Sakshi
Sakshi News home page

● వణికిన ఉద్దానం

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

● వణికిన ఉద్దానం

100 కి.మీ వేగంతో భారీగా

ఈదురుగాలులు

ఉవ్వెత్తున ఎగసిపడిన అలలు

కొబ్బరి రైతుకు తప్పనినష్టం

కవిటి:

గడిచిన మూడు రోజులుగా వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు ఉద్దానం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. మంగళవారం రాత్రి అమలాపురం సమీపంలో అర్నబ్‌ తీరం దాటిందన్న దశలో ఒకింత మనము సేఫ్‌ అనే ఆలోచనలో ఉద్దానం ప్రజలు సేదతీరారు. కానీ బుధవారం ఉదయం నుంచి భారీవర్షంతో పాటు కవిటి ఉద్దానం ప్రాంతంలో 100 కిలోమీటర్ల ప్రచండ వేగంతో వేచిన భీకరమైన గాలులతో ఉద్దానం కొబ్బరి రైతు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాడు. వాస్తవానికి కవిటి మండలంలో కొబ్బరి చెట్లు నేలకొరిగినవి చాలా తక్కువే.. కానీ నిలబడి ఉన్న చెట్టు కూడా ఈదురుగాలుల దాటికి భారీ స్థాయిలో నష్టాన్ని ఎదుర్కొంది. అయితే ఈ నష్టం తక్షణమే రైతుకు కనిపించకపోయినప్పటికీ, రాబోయే రెండేళ్లలో కొబ్బరి దిగుబడుల్లో తీవ్రమైనటువంటి నష్టాల్ని ఎదుర్కోక తప్పదని కన్నీరు మున్నీరవుతున్నాడు. ప్రభుత్వ లెక్కల్లో చెట్టు నేలకొరిగితేనే నష్టపరిహారం అందించే పరిస్థితుల్లో, తాజాగా అర్నబ్‌ తుఫాన్‌ సృష్టించిన విలయతాండవంతో జరిగిన నష్టాన్ని కొబ్బరి రైతు అనుభవించక తప్పని పరిస్థితి నెలకొంది. కవిటి మండలంలోని బీల ప్రాంతంలో మరో 20 రోజుల్లో వరిపంట చేతికందే దశలో కురిసిన భారీ వర్షాలకు ప్రస్తుతం దారుణంగా దెబ్బతింది. వరదనీరు తగ్గకపోతే భారీగా దిగుబడులు తగ్గే పరిస్థితులు ఉన్నాయి. మండలంలో విద్యుత్‌ శాఖ కూడా భారీ నష్టం చవిచూసింది. ఎక్కడికక్కడ విద్యుత్‌ స్తంభాలు విరిగిపడడం, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరగడం జరిగింది. జరిగిన నష్టాన్ని సరిదిద్ది విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడంలో విద్యుత్‌ శాఖ సిబ్బంది తీవ్రంగా చెమటోడుస్తున్నారు. తహసీల్దార్‌ టి.కల్యాణ చక్రవర్తి రెస్క్యూటీంతో కలిసి మండలవ్యాప్తంగా తిరిగి పడిపోయిన చెట్ల తొలగింపు తదితర పనుల్ని దగ్గరుండి పర్యవేక్షించారు. కవిటి వ్యవసాయాధికారి పి.శ్రీదేవి, ఉద్యానశాఖ అధికారి పి.మాధవీలత ఆయా శాఖలకు సంబంధించి పంటల్ని పరిశీలించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement