రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళం పరిధిలోని మునసబుపేట గాయత్రీ కాలేజీ జాతీయ రహదారి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సరుబుజ్జిలి మండలం పాతపాడు గ్రామానికి చెందిన డోలసాయి శ్రీధర్‌ (30) తన వ్యక్తిగత పనిమీద కారులో శ్రీకాకుళం వస్తుండగా, గురజాడ గాయత్రీ కళాశాల ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద ఆగివున్న లారీని ఒక్కసారిగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతుడు హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడికి భార్య, 18 నెలల పాప ఉంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement