స్వల్పంగా పెరిగిన వరద నీరు | - | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన వరద నీరు

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

హిరమండలం: వంశధార గొట్ట బ్యారేజీ వద్ద బుధవారం స్వల్పంగా నీటిమట్టం పెరిగింది. అర్నబ్‌ ప్రభావంతో గత రెండు రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. గొట్ట బ్యారేజీ వద్ద ప్రస్తుతానికి 34.60 మీటర్ల నీటిమట్టం ఉంది. బ్యారేజీకు ఇన్‌ఫ్లో మంగళవారం నాటికి 6,544 క్యూసెక్యుల నీరు వచ్చి చేరుతుంది. కాస్త పెరుగుతూ బుధవారం సాయంత్రానికి 10,848 క్యూసెక్యుల ఇన్‌ ఫ్లో వస్తోంది. వచ్చిన నీటిని 20 గేట్లు 20 సెంటిమీటర్ల మేరకు పైకి ఎత్తి దిగువకు నీటిని విడిచిపెట్టినట్లు డీఈఈ సరస్వతి, ఏఈ ఆనందరావులు తెలిపారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడిచిపెట్టకుండా నిలుపుదల చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement