ఫోర్జరీతో ఏకగ్రీవాలా..? | - | Sakshi
Sakshi News home page

ఫోర్జరీతో ఏకగ్రీవాలా..?

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

అందుబాటులో పోస్టల్‌ బ్యాలెట్‌

నరసన్నపేట: ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కోలేక కూటమి నాయకులు ఎంపీటీసీ ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పొందూరు మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి ఐదు చోట్ల ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయించుకోవడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అభివర్ణించారు. ఫోర్జరీ సంతకాలు వెనక ఉన్న అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు ఎంపీటీసీ అభ్యర్థులను ఫోన్‌లో బెదిరించడం దారుణమన్నారు.

కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా పోస్టల్‌ బ్యాలెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ శ్రీనివాసులు అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సుతో పాటు అవసరమైన ఫారం–10ఏ, 10సీలతో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్‌ విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను అక్టోబరు 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా వినియోగించుకోవాలని కమిషనర్‌ కోరారు.

3న కాదు..5న పోలింగ్‌..

● జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు

కొత్త షెడ్యూల్‌ ప్రకటన

అరసవల్లి: రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు రెండు రోజులు వాయి దా పడ్డాయి. పాత షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 3న జరగాల్సిన పోలింగ్‌ను వచ్చే నెల 5న నిర్వహించేలా, ఓట్ల లెక్కింపు 5వ తేదీకి బదులు 7న నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలకు మాత్రం సుప్రీం కోర్టు సూచనల మేరకు వచ్చే నెల 1న పోలింగ్‌, 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్న సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్‌ మేరకు నవంబర్‌ 5న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌, 6న రీపోలింగ్‌ (అవసరమైతే), 7న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement