సమాధానాలేవీ?
పొందూరు మండలంలోని పొందూరు 3, రాపాక 1, కోటిపల్లి, బాణాం, నందివాడ ఎంపీటీసీ స్థానాలు పోటీ లేక టీడీపీ ఏకగ్రీవమైనట్టు ప్రకటిస్తూ మంగళవారం రాత్రి 8గంటల సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యప్రకాశరావు జారీ చేసిన డిక్లరేషన్ ఇది.
తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన వెంటనే సదరు ఐదు స్థానాల ఎంపీటీసీ మహిళా అభ్యర్థులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి సూర్యప్రకాశరావును నిలదీశారు.
అసలు విత్‌డ్రాలు అందించిన వ్యక్తి ఎవరు?
ఆయన ఎన్ని గంటలకు వచ్చారు?
అభ్యర్థులే కాకుండా విత్‌డ్రాలేంటి?
విత్‌డ్రాలు చేయడానికి ఒక వ్యక్తి వచ్చారంటే ఆ వ్యక్తికి సంబంధించిన రుజువులేంటి? సీసీ ఫుటేజీలు తీసి చూపించొచ్చు కదా?
ఇలా అభ్యర్థులు అడిగిన ఒక్కప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు.


