యుటిలిటీ మీట్‌లో గుండ శివగంగాధర్‌ | - | Sakshi
Sakshi News home page

యుటిలిటీ మీట్‌లో గుండ శివగంగాధర్‌

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

శ్రీకాకుళం: రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగిన పదో డిస్ట్రిబ్యూషన్‌ యుటిలిటీ మీట్‌–2026 కార్యక్రమంలో కాలిఫోర్నియా ప్రతినిధిగా గుండ శివగంగాధర్‌ పాల్గొన్నారు. దివంగత శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ, లక్ష్మీదేవిల పెద్ద కుమారుడైన శివగంగాధర్‌ కాలిఫోర్నియాలో ఆ రాష్ట్ర ఎనర్జీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయనను జైపూర్‌లో పారిశ్రామిక రంగం అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న యుటిలిటీ మీట్‌లో ఆ దేశ ప్రతినిధిగా హాజరయ్యేందుకు పంపించారు. రాజస్థాన్‌ రాష్ట్రం విద్యుత్‌ రంగం అభివృద్ధి పురోగతిలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందంపై సంతకం చేసేందుకు గాను ఆయన భారతదేశానికి వచ్చారు. మంగళవారం ఈ ఒప్పందంపై రాజస్థాన్‌ రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీలతో కలిసి ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పుట్టిన దేశానికి కాలిఫోర్నియా ప్రతినిధిగా హాజరు కావడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి వృత్తిరీత్యా తనవంతు సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement