క్వాంటమ్‌తో కొత్త ఆవిష్కరణలు | - | Sakshi
Sakshi News home page

క్వాంటమ్‌తో కొత్త ఆవిష్కరణలు

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

విద్యుత్‌ షాక్‌తో ఆవు, దూడ మృతి

ఎచ్చెర్ల: క్వాంటమ్‌ టెక్నాలజీ వలన కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుందని జేఎన్‌టీయూ విజయనగరం ఐటీ విభాగం ప్రొఫెసర్‌ జి.జయసుమ అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో ఇన్నోవేటివ్‌ ప్రాంటియర్స్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఎఫ్‌ఎస్‌టీ)–2026పై జరిగిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు మంగళవారం ముగించారు. ఈ సందర్భంగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌పై జయసుమ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. క్వాంటమ్‌ టెక్నాలజీ మానవ జీవన ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం చూపించనుందో వివరించారు. ముగింపు సదస్సులో కాలిఫోర్నియా ప్రొఫెసర్‌ గంజి పి.నాగరాజు, ఆంధ్ర యూనివర్సిటీ మ్యాథమెటిక్స్‌ ప్రొఫెసర్‌ ఎం.వి.బసవేశ్వరరావులు ప్రసంగించారు. ముగింపు సదస్సుకు డాక్టర్‌ అనూరాధ, ఎన్‌.లోకేశ్వరిలు అధ్యక్షత వహించారు. పీలా సుజాత, స్వప్నవాహినిలు కన్వీనర్లుగా వ్యవహరించారు. యూనివర్సిటీ సైన్స్‌ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు పీఎం–ఉషా ఆర్థిక సహాయం అందించారు.

హుండీ ఆదాయం రూ.3.16 లక్షలు

జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని ఆలయ హుండీ ఆదాయం గడిచిన 84 రోజలుకు గానూ రూ.3,16,496 వచ్చినట్లు ఈవో కె.ఏడుకొండలు మంగళవారం తెలిపారు. ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తుల ఆధ్వర్యంలో హుండీ ఆదాయం లెక్కించారు. కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్‌ శివ ప్రసాద్‌ పాడి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో రెవెన్యూ ఉద్యోగి మృతి

శ్రీకాకుళం రూరల్‌: రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం పరిధిలోని కొత్తరోడ్‌ జంక్షన్‌ వద్ద నివాసముంటున్న రెవెన్యూ ఉద్యోగి నూనె శేఖర్‌ బాబు (45) మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. శేఖర్‌బాబు ఆమదాలవలసలోని రెవెన్యూ కార్యాలయంలో ఏఎస్‌ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే మంగళవారం ఉదయం 9 గంటలకు విధులకు బయల్దేరాడు. అయితే వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో స్థానిక చింతాడ పరిసర ప్రాంతంలో తన ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొంది. దీంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల. ఈయన భార్య వెంకటలక్ష్మి జి.సిగడాంలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టెక్కలి రూరల్‌: స్థానిక గోపినాథపురం గ్రామానికి చెందిన కొమరవెల్లి గడ్డయ్యకు చెందిన ఆవు, దూడ మంగళవారం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గడ్డయ్య తన ఆవు, దూడలను తన రేకుల షెడ్డులో ఇనుప రాడ్డుకి కట్టి ఉంచాడు. అయితే తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షానికి ఇనుప విద్యుత్‌ స్తంభం నుంచి విద్యుత్‌ వైరు కిందనున్న రేకుల షెడ్డుపై పడడంతో విద్యుత్‌ సరఫరా జరిగి షెడ్డులో ఉన్న ఆవు, దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన ఆవు, దూడ సుమారు రూ.40 వేలు విలువ ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement