‘షాడో’ సామ్రాజ్యం | - | Sakshi
Sakshi News home page

‘షాడో’ సామ్రాజ్యం

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

కాంట్రాక్టుల నుంచి కాంట్రాక్టు ఉద్యోగ నియామకాల వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే..

స్థానికేతరుడి పెత్తనంపై మండిపడుతున్న పలాస ప్రజలు

పలాసలో ..

కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గలో ఓ షాడో సామ్రాజ్యం విస్తరిస్తోంది. ‘తెర వెనుక నేత’ కనుసన్న దాటి ఏ పనీ జరగడం లేదనే చర్చ జోరందుకుంటోంది. కాంట్రాక్టులైనా, కాంట్రాక్టు ఉద్యోగాలైనా, ఎన్నికలైనా, ఎంపికలైనా అన్నీ ఆయన మాట మీదుగానే సాగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత చేసీ ఆయనది ఈ ఊరు కాదు.. ఈ ప్రాంతం కాదు. అయినా నెత్తినెక్కి పెత్తనం చెలాయిస్తూ ‘విసి’గిస్తుండడంపై పలాస ప్రజలు మండిపడుతున్నారు. అన్నీ తానై నడిపించే ఈ షాడో నేత 2014–2019 మధ్య కాలంలో ప్రతి పనికీ రేటు కట్టిన వైనం నియోజకవర్గంలో చాలా మందికి తెలుసు. తెర వెనుక ఉంటూ నియోజకవర్గాన్ని శాసిస్తున్న ’షాడో ప్రజాప్రతినిధి’గా పలాసలో ఆయన అవతరించారు. ప్రజా బలం లేని ఈ కీలక ప్రజా ప్రతినిధిని ప్రస్తుతం ‘విధేయతకు చెంపదెబ్బ’ అనే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఇక్కడ చైర్‌ పర్సన్‌ పీఠాన్ని జనరల్‌ మహిళ కేటగిరీకి కేటాయించారు. దీంతో పార్టీ శ్రేణులంతా ‘ఎల్‌కే’కే టికెట్‌ వస్తుందని భావించారు. పార్టీ పుట్టిననాటి నుంచి క్యాడర్‌ను పటిష్టం చేయడంలో ఎల్‌కే కీలక పాత్ర పోషించారు. కాబట్టి టికెట్‌ ఆయనకే దక్కుతుందనుకున్నారు. కానీ నామినేషన్లు ప్రారంభమైన రెండోరోజు అర్ధరాత్రి వేళ మద్యం డాన్‌కు కట్టబెట్టారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణులను నిర్ఘాంత పోయేలా చేసింది. ఎల్‌కే సామాజిక వర్గం వాళ్లయితే కుతకుతలాడిపోయారు.

చక్రం తిప్పుతున్న షాడో లీడర్‌

●పలాస నియోజకవర్గంలో జరిగే చిన్న అభివృద్ధి పని నుంచి పెద్ద కాంట్రాక్ట్‌ వరకు ఆ కీలక ప్రజాప్రతినిధి చేవ్రాలు ఆ దస్త్రంపై కనిపిస్తుంది.

● ఈ షాడో సామ్రాజ్యంలో ఒక విచిత్రమైన సూత్రం నడుస్తోంది. ఇక్కడ పార్టీపై ఉన్న నిబద్ధతకు కానీ, దశాబ్దాల సీనియారిటీకి కానీ ఎలాంటి విలువా లేదు. ప్రతి అంశానికి, ప్రతి పదవికి దాని స్థాయిని బట్టి ‘రేటు’ ఫిక్స్‌ చేస్తారని బయట టాక్‌.

● అభ్యర్థుల ఎంపికలో ప్రజాదరణ కంటే సదరు వ్యక్తి ఆర్థిక బలం ఎంత? ఎంత ఖర్చు పెట్టగలడు? అనేదే ఇక్కడ ప్రాథమిక అర్హత.

● పార్టీని నమ్ముకుని, ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన సీనియర్‌ నాయకులను పక్కన పెట్టి, కేవలం డబ్బు సంచులు ఉన్నవారికే పలాస చైర్‌ పర్సన్‌ పీఠం అప్పగించడంపై, పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకున్న నాయకులు లోలోపల కుమిలిపోతున్నారు.

పలాసను శాసిస్తున్న ‘తెర వెనుక నేత’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement