ఇచ్ఛాపురం రూరల్: కూటమిలో టీడీపీ మిత్ర ధర్మాన్ని తప్పిందని జనసేన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురం మండలంలోని 15 ప్రాదేశికాలకు సంబంధించి లొద్దపుట్టి–1, కేదారిపురం, కేశుపురం, తులసిగాం ప్రాదేశికాను జనసేనకు కేటాయించారు. సంబంధిత సమన్వయకర్త దాసరి రాజు సైతం అభ్యర్థుల వెంట నామినేషన్ దాఖలులో పాల్గొన్నారు. నామినేషన్ చివరి క్షణంలో జనసేన అభ్యర్థులంతా తప్పుకొని టీడీపీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని అధిష్టానం ఆదేశించడంతో జనసేన అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ ఫారం ఇవ్వకుంటే స్వతంత్య్రంగానైనా పోటీకి దిగుతామని అంటున్నారు. ప్రస్తుతం తులసిగాం, కేశుపురం, లొద్దపుట్టి–1, బూర్జపాడు ప్రాదేశికాల నుంచి జనసేన అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులకు రెబల్‌గా మారారు.


