కాశీబుగ్గలోని ఓ లాడ్జికి ఓ వ్యక్తి మహిళతో సహా బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వచ్చాడు. గది కావాలని అడగగా చిరునామా ధ్రువీకరణ నిమిత్తం నిర్వాహకులు ఆధార్ అడిగారు. అందుకు తన భార్య ఆధార్ ఉందంటూ ఇచ్చాడు. వివరాలు నమోదు చేసుకున్న లాడ్జి నిర్వాహకులు ఓరూమ్ కేటాయించారు. సరిగ్గా 11.15 గంటల సమయంలో ఆ వ్యక్తి బయట వేరే వ్యక్తిదగ్గర తన ఆధార్ కార్డు ఉందని తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం సమయంలో రూమ్‌లో ఉన్నవారికి భోజనం ఏమైనా కావాలా? అని అడిగేందుకు సిబ్బంది పలుమార్లు వారున్న రూమ్‌కు ఫోన్ చేశారు. పలుమార్లు వెళ్లి తలుపులు తట్టారు. స్పందన లేకపోయింది. అనుమానం రావడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్లి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా గదిలో మహిళ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు.
మాస్కుతో వచ్చాడు..మట్టుబెట్టాడు
గదిలో హత్యకు గురైన మహిళ టెక్కలి సర్వమంగళవీధికి చెందిన గోడుపు లక్ష్మి గా గుర్తించారు. ఈమెకు ఐదుగురు పిల్లలు. ఒడిశా రాష్ట్రం ఖరగ్‌పూర్‌లో ఉండేది. భర్తతో విభేదాలు తలెత్తడంతో టెక్కలి వచ్చేసింది. ఈలోగా విజయవాడకు చెందిన ఓ వ్యక్తితో పరిచయమై, ఆయనతో కలిసి కాశీబుగ్గ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో వచ్చిన వ్యక్తి లాడ్జికి సమీపంలోనే మాస్కు ధరించి ఎవరికీ తన ముఖం తెలియకూడదనే జాగ్రత్తపడ్డాడు. ఆధార్ కార్డును తనదికాకుండా లక్ష్మిది మాత్రమే ఇచ్చాడు. ఇవన్నీ చూస్తే హంతకుడు ముందస్తుగానే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. మరోవైపు లాడ్జిలో బసచేసేందుకు వచ్చిన సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన కొందరు బెంబేలెత్తిపోయారు. బిక్కుబిక్కుమంటూ ఆరుబయటే ఉండిపోయారు. లాడ్జి నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ డీఎస్పీ భవాని, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌లు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాశీబుగ్గ లాడ్జిలో మహిళహత్య?
పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో బుధవారం ఓ చోట దారుణం చోటుచేసుకుంటే.. మరో ప్రాంతంలో విషాదం అలముకుంది. కాశీబుగ్గ పట్టణం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఓ లాడ్జిలో జరిగిన హత్యలో మహిళ ప్రాణాలు కోల్పోగా.. పలాస పురుషోత్తపురం ఎర్ర చెరువులో ఓ వ్యక్తి నీట మునిగి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. –కాశీబుగ్గ
స్నానానికి
దిగి తనువు
చాలించాడు
పలాస–కాశీబుగ్గ పురపాలక పరిధి పురుషోత్తపురం ఎర్రచెరువులో ఓ వ్యక్తి చెరువులో మునిగి తనువు చాలించాడు. అల్లంశెట్టి హేమసుందర్ (40) స్నానానికి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతడ్ని కాపాడే ప్రయత్నంలో చెరువులోంచి బయటకు తీయ గా, అప్పటికే హేమసుందర్ మరణించాడు. అనుకోని సంఘటనతో హేమసుందర్ కుటుంబసభ్యులుశోకసంద్రంలో మునిగిపోయా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గోడుపు లక్ష్మి(ఫైల్)


