ఎచ్చెర్ల ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు | - | Sakshi
Sakshi News home page

ఎచ్చెర్ల ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

లావేరు: మండలంలోని బుడుమూరు పంచాయతీ పరిధి సెగిడిపేట గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును మురుగు నీటి కాలువ ఏర్పాటు చేయాలని కోరుతూ ముట్టడించి నిలదీశారు. బుధవారం సెగిడిపేట వద్దనున్న జాతీయ రహదారి నుంచి కూనపువానిపేట మీదుగా ఆరంగిపేట వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించడానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో కాలువ విషయమై సెగిడిపేట గ్రామస్తులు నిలదీశారు. గ్రామంలో మురుగు, వరద నీరు బయటకు పోవడానికి కాలువ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆక్రమణలను తొలగించి మురుగు, వరద నీరు బయటకు తరలిపోయే మార్గం చూపాలన్నారు. దీంతో సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్వశిక్షాభియాన్‌ ఏపీసీ పి.వేణుగోపాల్‌, ఎంపీడీవో పి.వెంకటరాజు, తహసీల్దార్‌ జీఎల్‌ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement