డుమ్మా కొట్టిన అధ్యాపకురాలికి జీతం! | - | Sakshi
Sakshi News home page

డుమ్మా కొట్టిన అధ్యాపకురాలికి జీతం!

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

ఎచ్చెర్ల: బీఆర్‌ఏయూలో రోజుకో విచిత్రం వెలుగు చూస్తోంది. అధ్యాపకులు విధులకు హాజరు కాకుండా హాజరైనట్లు సంతకం చేసి వేతనం పొందారని వర్సిటీలో ప్రచారం జరుగుతోంది. వర్సిటీలో ఇంజినీరింగ్‌ కళాఽశాలలో హెచ్‌పీఎస్‌ అండ్‌ హెచ్‌ఎస్‌ఎస్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ కెమిస్ట్రీ బోధించే ఓ అధ్యాపకురాలు ఆగస్టు నెలలో పూర్తిగా సెలవు పెట్టారు. సెలవు వల్ల వేతనం నిలిచిపోయింది. ఈ పరిస్థితిలో వేతనం కోసం అడ్డదారులను వెతికి చడీచప్పుడు కాకుండా సీఎల్‌గా ఉన్న హాజరు పట్టికలో సీఎల్‌ను సంతకంగా దిద్ది వేతనం పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ను వివరణ కోరగా ఆయన ఇదంతా అవాస్తవమని, అలాంటిదేదీ జరగలేదని చెప్పారు.

హాజరు పట్టిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement