తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

సోంపేట: ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల్లో నడుపుతున్న కనకదుర్గా ప్రైవేటు సర్వీసు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు సిబ్బంది, ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి అదే రాష్టం బరంపురం వరకు పలాస, సోంపేట, ఇచ్ఛాపురం మీదుగా కనక దుర్గా బస్సు సర్వీసు నడుపుతున్నారు. బుధవారం బస్సు డ్రైవర్‌ బస్సును సోంపేట వరకు సక్రమంగా తీసుకొచ్చాడు. సోంపేట బస్టాండ్‌ వద్ద బయల్దేరిన తర్వాత 20 అడుగులు వెళ్లే సరికి బస్సు డ్రైవర్‌ సాయికు గుండెపోటు, ఫిట్స్‌ వచ్చాయి. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రహదారి పక్కన నిలుపుదల చేసి సీటుపై కూలిపోయాడు. వెంటనే బస్సు సిబ్బంది, అక్కడే ఉన్న కనకదుర్గా ఆటో యూనియన్‌ సభ్యులు డ్రైవర్‌ను సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి ప్రథమ చికిత్స అందజేశారు. ప్రాణాపాయ స్థితిలో బస్సును డ్రైవరు పక్కకు నిలిపివేయడంలో బస్సులో ప్రమాణిస్తున్న సుమారు 40 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement