శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీల్లో భాగంగా బుధవారం తైక్వాండో, ఉషూ ఎంపికలను అధికారులు పూర్తిచేశారు. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్య జిల్లా అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేడపతున్న జిల్లా స్కూల్‌గేమ్స్ మలివిడత ఎంపిక పోటీలను బుధవారం నిర్వహించారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా తైక్వాండో పోటీలను, శ్రీకాకుళం డీఎస్‌ఏ స్విమ్మింగ్ వేదికగా ఉషూ ఎంపికలను చేపట్టారు. అండర్–14, 17, 19 వయో విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా ఎంపికలను నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారు. పోటీలను ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి చల్లా జగదీష్, పీడీలు పర్యవేక్షించారు.


