సర్కారు డప్పు
ఇదెక్కడి న్యాయం..?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ప్రజలకు సేవలందించాం. సర్కారుకు, జనాలకు మధ్య వారధిగా ఉంటూ ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించాం. కేవలం రూ.5వేల గౌరవ వేతనంతో అహర్నిశలు శ్రమించాం. అలాంటి మమ్మల్ని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. వలంటీర్లను కొనసాగించకపోగా ఇప్పుడు సోషల్ మీడియాలో తమకు వంత పాడేవారికి ప్రభుత్వం ఖజానా నుంచి నిధులు మంజూరు చేయాలని చూస్తోంది. ఇది ప్రభుత్వానికి భారం కాదా?..మాకూ న్యాయం చేయాలి. – కొంక్యాన నాగరాజు,
మాజీ వలంటీర్, సత్యవరం, నరసన్నపేట
ప్రజాధనంతో ప్రచారమా?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ల పాలసీ పథకం పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? గత వైఎస్సార్ ప్రభుత్వంలో వలంటీర్లుగా ప్రజలకు ఎంతో సేవ చేసిన మాకు ప్రభుత్వం పారితోషికం అందజేస్తే ఆనాడు ప్రజాధనం దుర్వినియోగంటూ.. ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు విమర్శించారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ల ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలి.
– పిన్నింటి ఫల్గుణరావు,
కోటగుడి కాలనీ, పాతపట్నం


