నేడు రెవెన్యూ క్లినిక్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు రెవెన్యూ క్లినిక్‌ రద్దు

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

● యథావిధిగా ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం యథావిధిగా జరుగుతుందని, రెవెన్యూ క్లినిక్‌ను మాత్రం రద్దు చేశామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ వెల్లడించారు. శ్రీకాకుళంలో ఆదివారం ప్రకటన విడుదల చేస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు పంట నష్టం అంచనాలు కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున రెవె న్యూ క్లినిక్‌ను రద్దు చేసినట్లు తెలియజేశారు.

60 మూగజీవాల దుర్మరణం

హిరమండలం: రసాయనాలు చల్లిన గ్రాసా న్ని తిని 60కుపైగా మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ విషాదకర ఘటన హిరమండలం మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నా యి. మర్రిగూడ పంచాయతీ పరిధిలోని వంశధార ఫేజ్‌–2 రిజర్వాయర్‌ మిగులు భూ ములు, ఎగువ ప్రాంతాల్లో పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన బతకల లక్ష్మీనారాయణకు చెందిన గొర్రెల మంద 40 రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మేకల మంద మర్రిగూడ పరిధిలో వంశధార రిజర్వాయర్‌ పరిధిలో నీలగిరితోటల్లో మేతకు దిగగా.. ఒక్కో గొర్రె అస్వస్థతతో నేలకొరిగింది. కళ్లెదుటే మూగజీవాలు నేలకొరుగుతుండడంతో కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మేత మేసే సమీప దూరంలో రైతులు వరి మళ్లకు గాబు నియంత్రణకుగాను రసాయనాలు చల్లారు. దాని ప్రభావంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఏకంగా 60 గొర్రెలు చనిపోయాయి. ఈ విషయం తెలియడంతో గొర్రెల పెంపకందారుల కుటుంబాలు అక్క డకు చేరుకున్నాయి. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంట సంరక్షణకుగాను సస్యరక్షణ చేపట్టినట్టు రైతులు చెబుతున్నారు. ఈ విషయం తెలియక గొర్రెల పెంపకందారులు నష్టపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement