ఉద్రిక్తంగా చలో విజయవాడ | - | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తంగా చలో విజయవాడ

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

● జిల్లా నుంచి 900 మంది సచివాలయ ఉద్యోగుల హాజరు

● మార్గమధ్యంలో జిల్లా ఉద్యోగ సంఘ నేతలను వేర్వేరు

ప్రాంతాలకు తరలించిన పోలీసులు

● ఉద్యోగం చేస్తాం.. ఊడిగం చెయ్యబోమంటూ నినాదాలు

అరసవల్లి:

సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఉద్య మ వేడి కూటమి ప్రభుత్వానికి ఘాటుగానే తగిలింది. ఉద్యోగులకు పదోన్నతులు, నోషనల్‌ ఇంక్రిమెంట్లు కల్పించాలంటూ వేలాది మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ ధర్నాకు దిగారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులంతా శనివారం సాయంత్రానికే విజయవాడ చేరుకోవడంతో ప్రభుత్వ ఆంక్షలకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి జిల్లాలో సచివాలయ ఉద్యోగుల సంఘ నేతల ఊర్లకు వెళ్లి మరీ విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే శనివా రం రాత్రి వేళలో విజయవాడ శివార్లకు చేరుకున్న ఉద్యోగుల సంఘ నేతలు, ఉద్యోగులపై పోలీసులు ప్రతాపం చూపించారు. ధర్నాచౌక్‌కు చేరకుండా పలువురిని నియంత్రణ చేశారు. దీంతో జిల్లాకు చెందిన సుమారు రెండు వందల మంది ఉద్యోగులను వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. జిల్లాకు చెందిన రాష్ట్ర నేతలతో పాటు ఉత్తరాంధ్ర జేఏసీ నేతలంతా ధర్నాచౌక్‌కు చేరుకున్నాక.. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకంగా లాఠీ చార్జికి దిగడంతో జిల్లాకు చెందిన ఉద్యోగులకు కూడా లాఠీ దెబ్బలు తగిలాయి. దీంతో ‘ఉద్యోగం చేస్తాం...ఊడిగం చెయ్యబోము’ అంటూ నినాదాలు చేశారు. అనుమతులు లేకుండా ధర్నాకు దిగడం, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన కారణంగా సచివాలయ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబును విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అలాగే ఈ ధర్నాలో ఉత్తరాంధ్ర జేఏసీ నేత కూన వెంకట సత్యనారాయణ, అబ్దుల్‌ రజాక్‌, సీపాన గోవింద, అయ్యప్ప, అప్పలనాయుడు, సుధీర్‌, బలివాడ రాజశేఖర్‌ తదితరులు హాజరయ్యారు.

సచివాలయ ఉద్యోగులపైనా రెడ్‌బుక్‌ రాజ్యాంగమా..!

లాఠీచార్జి, అరెస్టులను ఖండించిన

ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట: తమ హక్కులు, సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా విజయవాడలో ర్యాలీ చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తీవ్రంగా ఖండించారు. సచివాలయ ఉద్యోగులపై లాఠీచార్జి, అరెస్టులు చేయడం సరైంది కాదని కృష్ణదాస్‌ అభిప్రాయపడ్డారు. కూటమి రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి అంతు లేదా. అని ప్రశ్నించారు. గర్భిణులు, పిల్లలతో ఉన్న తల్లు లు అని చూడకుండా పోలీసులు జుట్లు పట్టుకొని ఈడ్చుకెళ్లడంపై కృష్ణదాస్‌ మండి పడ్డారు. 15 రోజులుగా అనుమతులు కోరుతున్నా ఇస్తాం.. ఇస్తాం అని పోలీసులు అంటూనే ఎక్కడికక్కడ నిర్బంధాలు చేయడం ఏమిటని అన్నా రు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా కృష్ణదాస్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement