ముంపు ప్రాంతాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాల పరిశీలన

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

నరసన్నపేట: మామిడివలస, కంబకాయ, చిక్కాలవలస ప్రాంతాల్లో వర్షం నీటి ముంపు పొలాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదివారం పరిశీలించారు. నీటి ముంపునకు కారణాలను ఆయన డ్రోన్‌ కెమెరా సాయంతో తెలుసుకున్నారు. వంశధార ఈఈ మురళీధర్‌కు పలు సూచనలు చేశారు. అలాగే కంబకాయకు చెందిన రైతు పాగోటి అప్పలనాయుడు కలెక్టర్‌కు ముంపు రైతుల పరిస్థితి వివరించా రు. నీరు సజావుగా వెళ్లిపోయేందుకు వీలుగా యాక్షన్‌ ప్లాన్‌ రెండు రోజుల్లో ఇవ్వాలని కలెక్టర్‌ వంశధార అధికారులను ఆదేశించారు. రైల్వే ట్రాక్‌ కింద ఉన్న కల్వర్టుల్లో పూడిక అధికంగా ఉండటం, గుర్రపు డెక్క అడ్డుకోవడంతో నీరు కిందకు వెళ్లకుండా నిలిచిపోయిందని కలెక్టర్‌ గుర్తించారు. రైల్వే ట్రాక్‌పై కిలోమీటరు దూరం వరకూ కలెక్టర్‌ కాలినడకన వెళ్లి ముంపు పొలాలను పరిశీలించారు. చిక్కాలవలస, నర్శింగపల్లి, మామిడి వలస ,కుద్దాం, బసివలస, కర గాం, కంబకాయ, గుండవలస తదితర గ్రామాల పరిధిలో 400 ఎకరాల వరకూ నీరు నిలిచి పోవడంతో వరి మొక్కలు జీవం లేని విధంగా తయారయ్యాయని రైతులు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిహోం పాండియా తో పాటు వ్యవసాయాధికారిణి వై. సూర్యకుమారి, తహసీల్దార్‌ టి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement