ఇటు వరద.. అటు అవినీతి బురద | - | Sakshi
Sakshi News home page

ఇటు వరద.. అటు అవినీతి బురద

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని పొన్నాం, బైరి, బట్టేరు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఓ వైపు వరదలతో నదులు పొంగి పొర్లుతుంటే.. నిల్వ ఉంచిన ఇసుకపై కూటమి నేతల కళ్లు పడ్డాయి. దీంతో చాపకింద నీరులా ఇసుకను పెద్ద పెద్ద జేసీబీ మిషన్లు పెట్టి ఎక్కడికక్కడే తోడేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా పడిన వర్షాలు కారణంగా పూర్తిగా నదులన్నీ జలమయమయ్యాయి. దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం నిల్వ ఉంచిన ఇసుకపై అధికార పార్టీ నేతలు దండిగా సొమ్ము చేసుకునేందుకు సమాయత్తమయ్యారు. బైరి తోటల్లోనూ, పొలాల్లోనూ, కళ్లా ల్లోనూ, వంశధార బ్రిడ్జి కింద దాచుకున్న ఇసుకను సైతం మూడో కంటికి కనిపించకుండా లారీలకు ఎత్తేస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుక రూ.2వేలకు గాను, సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు లారీకై తే రూ.పదిహేను వేలకు పైగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

పట్టించుకోని యంత్రాంగం

యథేచ్ఛగా ఇసుక రవాణా అక్రమంగా జరుగుతున్నప్పటికీ మైన్స్‌, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చూసీచూడనట్లుగానే వదిలేస్తున్నారన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. మండలంలో పలుచోట్ల తనిఖీలు చేశామని చెప్పడమే గానీ ఎక్కడా ఇసుకను సీజ్‌ చేసిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బైరి, బట్టేరు, పొన్నాం ప్రాంతాల్లో నిల్వ ఉంచిన ఇసుక కొన్ని వేల క్యూబిక్‌ టన్నులు ఎక్కడికక్కడే కనిపిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక రవాణా సాగిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.

బైరిలో ఎక్కడికక్కడే ఇసుక పోగులు

బైరి గ్రామంలో ఎక్కడికక్కడే ఇసుక పోగులు ఉన్నాయి. వరద లు, తుఫాన్‌లు వచ్చినా ఇసుక రవాణా ఇక్కడ ఆగడం లేదు. నిత్యం వందలాది ట్రాక్టర్లు, లారీలు సైతం ఇసుకను అక్రమంగా తరలించుకు పోతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం కూటమి నేతలంతా కలిసి తమ గ్రామంలోని తోటల్లోనూ, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఇసుక నిల్వ చేసుకున్నారు.

– ఎండి అసిరినాయుడు, మాజీ సర్పంచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement