● డీ పట్టా భూములను కబ్జా చేసిన టీడీపీ నాయకుడు
● వారసులమంటూ రికార్డుల్లో నమోదు
● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు
సంతబొమ్మాళి: వడ్డితాండ్ర రెవెన్యూ పరిధిలో డీ పట్టా భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వడ్డితాండ్రకు చెందిన 38 కుటుంబాలకు సుమారు 70 ఎకరాల వరకు భూమికి ఇందిరా గాంధీ హయాంలో డీపట్టాలు ఇచ్చారు. ఇందులో అనపాన కురుమయ్యకు చెందిన 2.50 ఎకరాలు, ఇచ్ఛాపురం బారికవాడుకు చెందిన 1.89 ఎకరాలు, రాజాబొడ్డుకు చెందిన 2.50 ఎకరాల స్థలంపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఈ భూమికి తామే వారసులమంటూ వడ్డితాండ్ర తాజా మాజీ సర్పంచ్ అట్టాడ రమణమ్మ, ఆమె భర్త అట్టాడ తిరుపతిరావు పేరున రెవెన్యూ రికార్డులో నమోదు చేసుకున్నారు. సర్వే నంబర్ 179–5, సర్వే నంబర్లు 183–1, 183–2ను రెడ్డిక, రజక కులానికి చెందిన పేదవారికి ప్రభుత్వం కేటాయిస్తే వారసులంటూ అట్టాడ తిరుపతిరావు, రమణమ్మల పేరున రెవె న్యూ అధికారులు ఏ విధంగా నమోదు చేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై రెవెన్యూ అధికారులను కూడా సంప్రదించామని, తహసీల్దార్ హేమసుందరరావును ప్రశ్నిస్తే.. తమనే తిరిగి బెదిరిస్తూ మాట్లాడారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆగస్టు 8వ తేదీన జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. డీ పట్టా భూములను తమ పేరున నమోదు చేసుకోవడమే కాకుండా మార్ట్‌గేజ్ చేసి పలు బ్యాంకుల్లో సుమారు రూ. 11లక్షలు రు ణాలను పొందారని బాధితులు అంటున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అధికారులను సస్పెండ్ చేయాలి
టెక్కలి: సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామంలో డీ పట్టా భూములను అక్రమంగా తా కట్టు పెట్టేందుకు పత్రాలను మంజూరు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు ఎన్.షణ్ముఖరావు, ఎ.షణ్ముఖరావు డి మాండ్ చేశారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ డీ పట్టా భూములకు పత్రాలను సృష్టించి వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని కోటబొ మ్మాళి కొన్ని బ్యాంకుల్లో రుణాలు పొందారని పేర్కొన్నారు. దీని పై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


