పాతపట్నం: మండలంలోని కొరసవాడ ప్రధాన రహదారిపై ధనుపురం నుంచి పాతపట్నం వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో కొరసవాడ గ్రామానికి చెందిన శంకర్ గాయపడ్డారు. శంకర్ మిశ్రా ద్విచక్రవాహనంపై వస్తుండగా కొరసవాడ వివేకానంద విగ్రహం వద్ద వచ్చేసరికి ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పాతపట్నం సీహెచ్‌సీ ఆటోపై తరలించారు. ప్రథమ చికిత్సను డాక్టర్ అనిత అందించి, మెరిగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. శంకర్ మిశ్రో ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేశామని, ట్రాక్టర్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చామని ఎస్‌ఐ కె.మధుసూధరావు తెలిపారు.


