టెక్కలి రూరల్: మండలంలోని పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం కృష్ణారావు మంగళవారం తెలిపారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో కర్నూలు డీఎస్‌ఏ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆట్యపాట్య క్రీడల్లో పాఠశాల నుంచి బి.హనీష్, పి.నరేష్ పాల్గొని ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. వీరిలో పి.నరేష్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో అక్టోబర్ 2 నుంచి 5 వరకు జరగనున్న జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గోనున్నట్లు వెల్లడించారు. దీంతో విద్యార్థులకు డిప్యూటీ డీఈవో పి.విలియమ్స్, వ్యాయామ ఉపాధ్యాయులు జగదీశ్వరరావు, ఆదిశేషు తదితరులు అభినందించారు.


