● హీరో సుహాస్
శ్రీకాకుళం అర్బన్: ‘మండాడి’ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని, వారికి ప్రత్యేక ధన్యవాదాలని ఆ సినిమా హీరో సుహాస్ అన్నారు. ‘మండాడి’ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలోని కిన్నెర కాంప్లెక్స్‌ను హీరో సుహాస్ సందర్శించి ప్రేక్షకులతో ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ప్రతి సినిమాను జిల్లా ప్రజలు, అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మండాడి సినిమా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.65కోట్లు వసూలు చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.


