హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Sep 16 2026 4:19 AM | Updated on Sep 16 2026 4:19 AM

పాతపట్నం: పాతపట్నం మేజర్‌ పంచాయతీ కాపువీధికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కలమట యశ్వంత్‌ (23) హైదరాబాద్‌లో హాస్టల్‌ భవనం నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. యశ్వంత్‌ తండ్రి కలమట రమేష్‌ విశ్రాంత సైనికుడు కాగా ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి కలమట బిందు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఒక్కొగానొక్క కొడుకు మృతి చెందడంతో పాతపట్నం కాపువీధిలో విషాదచాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చి వెళ్లాడని, తండ్రికి వ్యవసాయంలో సాయపడేవాడని

స్నేహితులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement