శ్రీకాకుళం: విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించేందుకు, ప్రశ్నించేతత్వాన్ని ప్రోత్సహించేందుకు చెకు ముకి సైన్సు సంబరాలు దోహదపడతాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, జిల్లా కన్వీనర్ పి.కూర్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రెండ వ దశ మండల స్థాయి చెకుముకి సైన్సు సంబరాలు విజయవంతంగా జరిగాయన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో చెకుముకి సైన్సు మండల స్థాయి సంబరాలు నిర్వహించామన్నారు. జిల్లాలో 30 మండలాల్లో 435 పాఠశాలల్లో 25 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు.


