ఆటో బోల్తాపడి డ్రైవర్‌కు గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తాపడి డ్రైవర్‌కు గాయాలు

Sep 12 2026 2:00 AM | Updated on Sep 12 2026 2:00 AM

ఆటో బోల్తాపడి డ్రైవర్‌కు గాయాలు వరకట్న వేధింపుల కేసులో వ్యక్తి జైలుశిక్ష బంగారం మెరుగు కేసులో వ్యక్తి అరెస్టు వృద్ధురాలు అదృశ్యం రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ కొనసాగింపు అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు ‘చంపేస్తామని బెదిరిస్తున్నారు’

టెక్కలి రూరల్‌: స్థానిక మండాపొలం కాలనీ వద్ద శుక్రవారం సాయంత్రం ఆటో బోల్తాపడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి పలాస వైపు ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో మండాపొలం కాలనీ సమీపంలోకి వచ్చే సరికి కుక్కలు అడ్డురావడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా డ్రైవర్‌ గేదెల శంకరరావు ఆటో కింద ఇరుక్కుని గాయపడ్డా డు. బాధితుడిని వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రి కి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేశారు.

జి.సిగడాం(పొందూరు): వరకట్న వేధింపు కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ పొందూరు కో ర్టు న్యామయూర్తి బి.జ్యోత్స్న శుక్రవారం తీర్పునిచ్చారు. పొందూరు మండలం ఖాజీపేటకు చెందిన పల్ల ఎర్రయ్య తన భార్య రాజేశ్వరిని వరకట్నంతోపాటు శారీరకంగా మానసికంగా వేధిన్నాడని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు నేరం రుజవు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధించారు.

కొత్తూరు : కర్లెమ్మ పంచాయతీ అఫీషియల్‌ కాలనీలో ఇటీవల బంగారం వస్తువులకు మెరు గుపెడతామని చెప్పి పుస్తెలతాడు అపహరించుకుపోయిన కేసులో బీహార్‌ రాష్ట్రానికి చెంది న దినేష్‌కుమార్‌ యాదవ్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ కె.వెంకటేష్‌ తెలిపారు. దినేష్‌కుమార్‌ యాదవ్‌తో పాటు మరో వ్యక్తి నమ్మించి పుస్తెలతాడుతో పరారయ్యారని, దర్యాప్తు నిర్వహించి యాదవ్‌ను అరెస్టు చేశామని చెప్పారు.

మందస: చిన్నలోహరిబంద గ్రామానికి చెందిన తల్ల వీరమ్మ(63) రెండు రోజు లుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శుక్రవా రం మందస పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. అంబుగాం వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నరసన్నపేట: చైన్నె–కోల్‌కతా రైలు మార్గంలో మామిడివలస వద్ద కోరమండల్‌ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతిచెందా డు. మృతుడు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం మాల్డాకు చెందిన తపాన్‌ కిస్కూ (29)గా గుర్తించారు. కూలి పను ల కోసం చైన్నె వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమదాలవలస రైల్వే హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు.

ఎచ్చెర్ల : శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నాలుగు డిప్లమో ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌లకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) న్యూఢిల్లీ అక్రిడిటేషన్‌ పొడిగించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ సమర్పించిన కాంప్లిన్స్‌ రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరం ఎన్‌బీఏ ఈ నిర్ణయం తీసుకుందని ప్రిన్సిపాల్‌ కె.నారాయణరావు శుక్రవారం తెలిపారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ది ఫాల్స్‌ లీడర్‌ పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జర్నలిస్టు అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు డీఎస్పీ సీహెచ్‌ వివేకానందకు వినతిపత్రం అందించారు. ప్రసాద్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జి.ఎజ్రా, పి.అప్పన్న, బి.వేణు, ఎ.కృష్ణ, డి.గోవింద్‌ తదితరులున్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : కొంతమంది వ్యక్తులు చంపేస్తామని బెదిరిస్తున్నారని, వీరి నుంచి రక్షణ కల్పించాలని ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన కొయ్య సత్యనారాయణ, భవాని దంపతులు కోరారు. శుక్రవారం వారు మాట్లాడుతూ తమ కుటుంబం 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఏడు ఎకరాల జీడి తోటను ధ్వంసం చేయడమే కాక ఎటువంటి సంబంధం లేని వ్యక్తి పేరును భూ రీసర్వే సమయంలో జాయింటుగా నమోదు చేశారన్నారు. దీనిపై ఈ నెల 2న రెవెన్యూ అధికారులకు, పోలీసులకు, ఎస్పీ గ్రీవెన్స్‌లో సైతం ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement