ఎచ్చెర్ల : ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్మించడమే కామ్రేడ్ సీతారాం ఏచూరికి మనం ఇచ్చే ఘన నివాళి అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు చంద్రరావు అన్నారు. సీఐటీయూ మండల కన్వీనర్ ఎన్.బంగార్రాజు అధ్యక్షతన శుక్రవారం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు టి.రామారావు, ఎల్.రామప్పడు, ఎం.ఎ.రమణ, సత్యనారాయణ, ఎన్.నాగేశ్వర రావు, కేదారేశ్వరరావు, బెవర శ్రీను, ఎం.వి.రమణ, గోవిందు పాల్గొన్నారు.


