ఆమదాలవలస : గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ప్రేరణ కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలలో ప్రేరణ కార్యక్రమంపై పరీక్ష నిర్వహించి ఎంపికై న వారికి ఇంటర్వ్యూ చేసి అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా అందులో ఆమదాలవలస పట్టణంలోని మెట్టక్కివలస మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి రుంకు హర్షవర్ధన్ ఒకరు. వీరిని ప్రధాని మోదీ చదివిన పాఠశాల వాద్నగర్‌కు నవంబర్ 15 నుంచి 21 వరకు తీసుకెళ్లి ప్రేరణ కలిగిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా హర్షవర్దన్‌ను శుక్రవారం పాఠశాలలో సన్మానించారు.


