శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బేస్‌పోటీల్లో జిల్లా జట్లు సమష్టిగా రాణించి విజయదుందుభి మోగించాలని బేస్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుతమ్మినేని సుజాత పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 8వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషులు, మహిళల బేస్‌బాల్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు శుక్రవారం ఇక్కడి నుంచి పయనమై వెళ్లాయి. జిల్లా కార్యదర్శి వీరభద్రరావు, కొండపల్లి కిరణ్‌కుమార్, పొట్నూరు అజయ్‌కుమార్ సంయుక్తంగా సమకూర్చిన క్రీడాదుస్తులను క్రీడాకారులకు, కోచ్ మేనేజర్లకు పంపిణీ చేశారు. ఎన్.రవిబాబు, వి.గురుమూర్తి క్రీడాకారులకు రవాణా ఖర్చుల నిమిత్తం రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. కాగా అంతకుముందు వారం రోజుల పాటు పురుషుల జట్టుకు బొంతలకోడూరు(ఎచ్చెర్ల మండలం)లో, మహిళల జట్టుకు ఇప్పిలి (శ్రీకాకుళం రూరల్ మండలం) వేదికగా రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపు నిర్వహించేందుకు అవసరమైన మొత్తాన్ని, క్రీడాకారులకు వసతి, భోజన ఏర్పాట్లను బేస్‌బాల్ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సుజాత, కార్యదర్శి వీరభద్రరావు సమకూర్చి క్రీడాకారులకు అండగా నిలిచారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.రవికుమార్, కోచ్ మేనేజర్లు, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


