నాలోని హైజంప్ ప్రతిభను గుర్తించి నన్ను క్రీడారంగంలో ముందుకు నడిపించిన వ్యక్తి మా వ్యాయామ ఉపా ధ్యాయుడు వజీర్ అహ్మద్ మాస్టారు. ఆయన ప్రోత్సాహంతోనే జాతీయ స్థాయి హైజంప్ క్రీడాకారుడిగా ఎదిగాను. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించానంటే అందుకు బీజం వేసింది మా వజీర్ మాస్టారే. నా విజయానికి తొలి గురువు, తొలి ప్రేరణ మా వజీర్ అహ్మద్ మాస్టారే. ఆయన ఎప్పటికీ నాకు స్ఫూర్తే.
– ఎం.రమేష్,
ఎస్.ఎన్.పుట్టుగ


