శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని అలి కాం గ్రామానికి చెందిన చేనేత మాస్టర్ మురకల నటరాజ్ ప్రతిష్టాత్మకమైన జాతీయ చేనేత పురస్కారాన్ని ఢిల్లీలో అందుకున్నారు. దీంతో శనివారం పెదపాడులోని ధర్మాన క్యాంప్ కా ర్యాలయంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌లు కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో జిల్లా చేనేత రంగానికి గుర్తింపు తీసు కురా వడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
టెక్కలి: తమ ప్రాంతంలో హానికరమైన రసాయన పరిశ్రమల పార్కులకు ఎలాంటి భూములిచ్చేది లేదంటూ సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా స్పష్టం చేశారు. ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి నేతృత్వంలో శనివారం వడ్డితాండ్ర లో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు, ప్రజలు మాట్లాడుతూ కెమికల్ పార్కుల వల్ల తమ జీవనోపాధి పూర్తిగా కోల్పోతామని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పరిశ్రమలకు అంగీకరించేది లేదని వెల్లడించారు. కెమికల్స్ పార్కులకు సుమారు మూడు వేల ఎకరాల భూములు అవసరమని, దీనికి ఒక్క వడ్డితాండ్ర పంచాయతీలో 500 ఎ కరాలు భూసేకరణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. దీని పై రైతులు, ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. రైతులు, మత్స్యకారులు, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసే కెమిక ల్స్ పరిశ్రమలు కాకుండా అందరికీ ఆమోదయోగ్య మైన పరిశ్రమలు వస్తే తమ ఆలోచన చెబుతామని స్థానికులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ హేమసుందర రావుతో పాటు వడ్డితాండ్ర పంచాయతీ పరిధిలో రైతులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
సంతబొమ్మాళి: సీతానగరం గ్రామంలో తాగునీటి పైపులైన్ పనులను మహిళలు శనివారం అడ్డుకున్నారు. మూలపేట పోర్టు ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి సీతానగరం గ్రామం మీదుగా తాగునీటి పైపులైన్లు వేస్తుండగా మహిళలు పనులను నిలిపివేశారు. తామే రెండేళ్లుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తాగునీరు అందించకుండా మా గ్రామం మీదుగా పైపులైన్లు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పైపులైన్ ద్వారా తమకు కూడా తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు నీటి సౌకర్యం కల్పించే వరకు పనులు జరగనివ్వబోమని భీష్మించారు.దీంతో కొద్దిసేపు పనులు నిలిచిపోయాయి. ఓ జనసే న కార్యకర్త వచ్చి మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. అంతా కలిసి అతడిపై మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలతో మాట్లాడి పనులు కొనసాగించారు.


