శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆర్థిక మంజూరు లభించిన నాలుగు నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే ఆ ఎంపీ ల్యాడ్ నిధులను నిరుపయోగంగా ఉంచకుండా, తక్షణమే ఇతర అత్యవసర ప్రజా ప్రయోజన పనులకు మళ్లించి వినియోగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించా రు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలసి ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించాలని, జల జీవన్ మిషన్ పురోగతిపై ఎమ్మెల్యేలకు సమాచారం అందించాలన్నారు.


